పనీర్ కబాబ్స్
పనీర్ తో చేసే వంటకాలంటే చాలామందికి ఇష్టం. అందులోనూ పనీర్ కబాబ్స్ పేరు వినగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి చాల మందికి. అవి ఇంట్లోనే ఈజీ గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
పనీర్ - 200 గ్రా
చెర్రీ టమాటో - 10
కాప్సికం - 2
పచ్చిమిర్చి -5
ఉల్లిపాయ పెద్దది - 1
అల్లం తురుము - 1 టీ స్పూన్
వెల్లుల్లి - 3 రెబ్బలు
కొత్తిమీర తురుము - 5 స్పూన్స్
పెరుగు - 1 కప్పు
పసుపు - కొద్దిగా
జీలకర్ర పొడి - 1/4 స్పూన్
గరం మసాలా - కొద్దిగా
మిరియాల పొడి - కొద్దిగా (optional)
నిమ్మకాయ - 1
ఉప్పు, కారం - రుచికి తగినంత
తయారి విధానం:
ముందుగా కాప్సికంని, ఉల్లిపాయల్ని, పెద్ద పెద్ద ముక్కలుగా వీలయితే స్క్వేర్ శాపే వచ్చేలాగా అందంగా కట్ చేసి ఉంచుకోవాలి. అప్పుడు దంచిన వెల్లులి రెబ్బలు, తురిమి పెట్టుకున్న అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు జీలకర్ర పొడి, గరం మసాలా అన్నిటిని పెరుగులో వేసి మెత్తని పేస్టులా తయారుచేయాలి. ఈ పేస్టులో స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్న పనీర్ ముక్కలను వేసి రెండు గంటలు నాననివ్వాలి. ఇలా నానిన పనీర్ ముక్కల్ని, కాప్సికం ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, చెర్రి టమాటాలని చువ్వకు వరుసగా గుచ్చి ఒవేన్ లో గ్రిల్ చేసుకోవాలి, ఒవేన్ లేనివాళ్ళు స్టవ్ మీద పెట్టి సన్న మంటపై కాల్చుకోవచ్చు. కాల్చిన కబాబ్స్ మీద కావాలంటే మిరియాలపొడి చల్లుకోవచ్చు. చివరగా వీటిపై నిమ్మరసం పిండుకుని తింటే అబ్బా! టేస్ట్ అదిరింది అని తినేయచ్చు.
- కళ్యాణి
