పన్నీర్ ఫింగర్స్
కావలసిన పదార్థాలు:-
పన్నీర్ - 200 గ్రాములు
కార్న్ ఫ్లోర్ - 3 స్పూన్లు
మైదా -1/2 స్పూన్లు
కారం - 1 చెమ్చా
ధనియాల పొడి - 1/2 చెంచా
జీరా పొడి - 1/2 చెంచా
మిరియాల పొడి - 1/2 చెంచా
సన్నగా తరిగిన కొత్తిమీర - 1స్పూను
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారు చేయు విధానం:-
* ముందుగా పన్నీరు ని వేడి నీళ్లలో 2 నిమిషాలు ఉంచి బయటికి తీసి, ఆ పన్నీరు ని 2 ఇంచుల పొడవుగా, దీర్ఘ చతురస్రం గా కట్ చేసుకోవాలి.
* ఒక పాత్రలో, ఉప్పు, కారం వేసి బాగా కలిపి, ఆ మిశ్రమం లో ఈ పన్నీరు ముక్కలు వేసి పది నిముషాలు పక్కన ఉంచాలి.
*ఇప్పుడు వేరొక పాత్రలో, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, జీరా పొడి, ధనియ పొడి, మిరియాల పొడి వేసి , కాస్త ఉప్పు తో బాటు రెండు మూడు చెంచాల నీళ్లు వేసి కలుపుతూ, పిండి ని పలుచని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
* ఇప్పుడు, బాండీ లో నూనె పోసి, నూనె కాగగానే, ముందుగా తయారు చేసికొన్న పన్నీరు ముక్కలు ఒక్కొక్కటి గా పిండి లో ముంచుతూ నూనె లో వేసి ఫ్రై చేసుకోవాలి.
* ఫ్రై చేసిన పన్నీర్ ఫింగర్స్ పై కొత్తిమీర చల్లి, వేడి వేడి స్నాక్స్ గా అందించండి.
-Bhavana
