పాలకూర కట్ లెట్
కావలసిన పదార్దాలు..
* పాల కూర - 1 కట్ట తరిగినది
* ఆలు గడ్డ - 2 ఉడికించి మెత్తగా చేసినవి
* మొక్క జొన్న పిండి (కార్న్ ఫ్లోర్ ) - 2 - 3 స్పూన్స్
* మైదా - 2 స్పూన్
* కారం - 1 స్పూన్
* బ్రెడ్ ముక్కలు - 1 కప్పు
* ఉప్పు
తయారీ విధానం
* ముందుగ పాల కూరను, ఆలు గడ్డ, మొక్క జొన్న పిండిని ,మైదా, కారం, ఉప్పు అన్ని వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి.
* ఒక ముద్ద తీసుకొని ప్యాటీ ల చేసుకొని బ్రెడ్ ముక్కల్లో అద్దుకొని పక్కన పెట్టాలి.
* ఇప్పుడు ఒక పాన్ తీసుకొని.. దానిలో కొంచెం నూనె పోసి అది కాగాక ఈ ప్యాటీస్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే పాల కూర కట్ లెట్ రెడీ.
