నవరతన్ మిక్స్చేర్
హాలిడేస్ వస్తున్నాయంటే చాలు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ప్రతి గంటకి ఏదో ఒకటి పెట్టమని అడుగుతూనే ఉంటారు. ప్రతీసారి బయట ప్రిపేర్ చేసిన ఫుడ్ పెట్టి వాళ్ళ ఆరోగ్యం పాడుచేయలేము కదా. అందుకే బయట స్వీట్ స్టాల్ లో చేసినట్టే మనం కూడా ఇంట్లోనే ఏదో ఒక వెరైటీ మిక్స్చేర్ చేస్తే పిల్లలకి ఆరోగ్యం మనకి ఆనందం.
కావాల్సిన పదార్థాలు:
సెనగ పప్పు - 100 గ్రా
పెసర్లు - 50 గ్రా
బొబ్బర్లు - 50 గ్రా
బఠాణి - 50 గ్రా
మొక్కజొన్న ఫ్లేక్స్ - 50 గ్రా
పల్లీలు - 50 గ్రా
పుట్నాలు - 50 గ్రా
జీడిపప్పు - కొద్దిగా
బాదంపప్పు - కొద్దిగా
సన్న బూంది - కొద్దిగా
కరివేపాకు - కొద్దిగా
జీలకర్రపొడి - 1/4 స్పూన్
ధనియాలపొడి - చిటికెడు
ఉప్పు కారం - తగినంత
తయారి విధానం:
సెనగ పప్పు, పెసర్లు, బఠాణి ఈ మూడింటిని నానపెట్టుకుని నానాకా నీరు ఒంచి ఒక గుడ్డ పైన గాలిబారెలా ఎండబెట్టాలి. వాటిలో నీరంతా పోయింది అనుకున్నాకా స్టవ్ మీద కడాయి పెట్టి నిండా నూనె పోసి వీటిని ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. ఆ నూనెలోనే మొక్కజొన్న ఫ్లేక్స్ కూడా వేయించుకోవాలి. మరో కడాయిలో కాస్త నెయ్య వేసి జీడిపప్పు, బాదాం పప్పు(సన్న చీలికలు), పల్లీలు, పుట్నాలు, కరివేపాకుని వేయించుకోవాలి. సన్న బూంది దూచటం వచ్చిన వాళ్ళు బూంది ఇంట్లోనే చేసుకోవచ్చు లేదా బయట దొరికేది కాస్త తెచ్చుకుని వేపిన మిశ్రమాలన్నిటిని ఒక బేసినలో వేసి కలపాలి. అందులో తగినంత ఉప్పు, కారం, జీలకర్రపొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పులుపు ఇష్టపడేవాళ్ళు నిమ్మ ఉప్పుని పొడి చేసి అది కూడా చల్లుకోవచ్చు. కొందరు టేస్ట్ కోసం కోసం ఆఖరున కాస్తంత పండర పొడిని కూడా చల్లుతారు. ఇలా చేసిపెట్టుకున్న మిక్స్చేర్ గాలిబారని డబ్బాలో పెట్టుకుంటే కనీసం 20రోజులు పాడవకుండా ఉంటుంది.
- కళ్యాణి
