మష్రూమ్ ఆమ్లెట్
కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు : రెండు
మష్రూమ్ ముక్కలు : అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు : పావుకప్పు
అల్లం తురుము : రెండు చెంచాలు
వెల్లుల్లి తురుము : ఒక చెంచా
సన్నగా తరిగిన పచ్చిమిర్చి : ఒక చెంచా
జీలకర్ర పొడి : అరచెంచా
ధనియాల పొడి : అరచెంచా
కారం : అరచెంచా
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
కరివేపాకు : ఒక రెమ్మ
కొత్తిమీర : కొద్దిగా
నూనె : రెండు చెంచాలు
తయారీ విధానం:
కరివేపాకు, కొత్తిమీరని శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి. ఓ బౌల్ లో కోడిగుడ్ల సొన వేసి బాగా గిలకొట్టాలి. స్టౌ మీద గిన్నె పెట్టి నూనె వేయాలి. వేడెక్కా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. కాస్త రంగు మారాక మష్రూమ్ ముక్కలు కూడా వేసి మెత్తబడేవరకూ వేయించాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి, కోడిగుడ్డు సొనలో వేసి కలపాలి. ఆపైన మిగతా పదర్థాలు కూడా వేసి బాగా కలపాలి. స్టౌ మీద అట్ల రేకు పెట్టి ఆమ్లెట్ వేయాలి. కొద్దిగా నూనె కానీ బటర్ కానీ వేసి రెండు పక్కలా కాల్చుకోవాలి.
- sameeranj
