మునగాకు - పెసరపప్పు ఫ్రై
కావలసిన పదార్థాలు:
పెసరపప్పు - ఒక కప్పు
మునగాకు - రెండు కప్పులు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - ఒకటి
ఆవాలు - అరచెంచా
పసుపు - చిటికెడు
కరివేపాకు - ఒక రెమ్మ
కారం - ఒక చెంచా
ఉప్పు - తగినంత
నూనె - ఒక చెంచా
తయారీ విధానం:
పెసరపప్పును బాగా కడిగి ఉడికించాలి. పప్పు మరీ పేస్ట్ అయిపోయేలా కాకుండా పప్పులు కనిపించేలా ఉంచుకోవాలి. మునగాకును శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడక్కాక ఆవాలు, కరివేపాకు వేయాలి. చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. రంగు మారాక మునగాకు వేయాలి. ఆకు ఉడికి సాఫ్ట్ గా అయ్యేవరకూ వేయించాక పెసరపప్పు వేయాలి. రెండిటినీ బాగా కలిపి సన్నని మంట మీద ఓ రెండు నిమిషాల పాటు వేయించాక.. ఉప్పు, కారం, పసుపు వేసి మరికాసేపు వేయించాలి. పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చేవరకూ వేయించి దించేయాలి.
- sameera
