మెంతి పూరీలు
కావలసిన పదార్థాలు:
గోధుమపిండి - రెండు కప్పులు
తరిగిన మెంతికూర - ఒక కప్పు
మైదా - అరకప్పు
బొంబాయిరవ్వ - రెండు చెంచాలు
చక్కెర - ఒక చెంచా
ఉప్పు - ఒక చెంచా
సోంఫు - అరచెంచా
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
ఓ బౌల్ లో గోధుమ పిండి, మైదా, బొంబాయి రవ్వ, చక్కెర, ఉప్పు వేయాలి. దీనిలో ఓ చెంచాడు నూనె వేసి కలపాలి. ఆ పైన మెంతికూర, సోంఫు వేసి బాగా కలపాలి. తరువాత కొద్దికొద్దిగా నీరు పోస్తూ పూరీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. దీన్ని అరగంట పాటు పక్కన ఎట్టేయాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
- Sameera
