మెంతికూర దోసెలు
మెంతికూర చేదుగా ఉంటుంది కాబట్టి దానిని స్పెషల్ గా వండుకొని తినలే. అయితే దానిని పప్పులో, మరోలా వేసుకొని తింటారు. అయితే ఈసారి ఈ మెంతికూరతో దోసెలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.. మీరూ ఒకసారి ట్రై చేయండి..
కావలసిన పదార్ధాలు:
మెంతికూర - నాలుగు కట్టలు
ఉప్పు – ఒక స్పూన్
కారం – ఒక స్పూన్
నూనె – తగినంత
తయారుచేయు విధానము:
1. ముందుగా మెంతికూరను శుబ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి.
2. ఆ తరువాత కడాయిని పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె వేసి మెంతాకును వేపుకొవాలి
3. అది చల్లారిన తరవాత గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి.
4. ఇప్పుడు దోసెల పిండిలో ఉప్పు, కారం, గ్రైండ్ చేసిపెట్టుకున్న మెంతికూర పేస్ట్ వేసి బాగా కలిపుకోవాలి
5. పాన్ పొయ్యి మీద పెట్టి అది బాగా వేడెక్కిన తరవాత కొంచెం నూనె వేసి, పిండిని ఇప్పుడు దోసలా వేసి, కొంచెం నూనె నాలుగు వైపుల వేసుకొని దోరగా కాల్చుకోవాలి. అంతే! ఎంతో రుచిగా వుండే మెంతికూర దోసె రెడీ!
