మ్యాంగో పీడా
కావలసిన పదార్థాలు:
మామిడిపండ్లు - రెండు
చక్కెర - అరకప్పు
పాలు - ఒక కప్పు
మిల్క్ మెయిడ్ - ఒక టిన్
నెయ్యి - రెండు చెంచాలు
యాలకుల పొడి - అరచెంచా
కుంకుమపువ్వు - చిటికెడు
పిస్తాపప్పు లు - ఐదు
తయారీ విధానం:
మామిడిపండ్లను చక్కెరతో కలిపి గుజ్జులా చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టౌ మీద పెట్టాలి. వేడెక్కాక చెంచాడు నెయ్యి వేయాలి. కాస్త వేడెక్కిన తరువాత పాలు, మిల్క్ మెయిడ్ ఒకేసారి వేయాలి. సన్నని మంటమీద అడుగంటకుండా కలుపుతూ మరిగించాలి. కాస్త చిక్కగా అయ్యాక దించేసి పక్కన పెట్టాలి. మరో గిన్నె స్టౌమీద పెట్టి మిగిలిన చెంచాడు నెయ్యి వేయాలి. వేడెక్కాక మామిడిగుజ్జు, యాలకుల పొడి వేసి ఉడికించాలి. చిక్కగా అయ్యి గిన్నెకు అంటుకుంటున్నప్పుడు పాల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండి, దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి. కొంచె వేడిగా ఉన్నప్పుడే చేతికి కాస్త నూనె రాసుకుని నచ్చిన ఆకారంలో ఒత్తుకుని పిస్తాపప్పుతో అలంకరించాలి.
- Sameera
