మ్యాంగో కుల్ఫీ
కావలసిన పదార్థాలు:
పాలు - ఒకటిన్నర కప్పు
మిల్క్ మెయిడ్ - ఒక టిన్
క్రీమ్ - అరకప్పు
మామిడిపండు ముక్కలు - ఒక కప్పు
యాలకుల పొడి - ఒక చెంచా
కుంకుమపువ్వు - చిటికెడు
రోజ్ వాటర్ - అరచెంచా
తయారీ విధానం:
మామిడిపండు ముక్కలు, పాలు, మిల్క్ మెయిడ్ ను కలిపి రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టాలి. తరువాత దీనిలో క్రీమ్, కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి మరోసారి బాగా బ్లెండ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్ లో వేసి ఫ్రీజర్ లో పెట్టాలి. గట్టిపడిన తరువాత తీసి రోజ్ వాటర్ పైన చల్లి సర్వ్ చేయాలి. అందుబాటులో లేకపోయినా, అవసరం లేదనుకున్నా రోజ్ వాటర్ ను అవాయిడ్ చేయవచ్చు. కావాలంటే దీనిలో సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకోవచ్చు.
- Sameera
