ప్రేమతో సమోసా
వాలెంటైన్స్ డే స్పెషల్ సమోసా మీకిష్టమైన వారికి తినిపించకపోతే ఎలా? మరి తయ్యారుచెయ్యటానికి రెడీ అయిపోదాం....
కావాల్సిన పదార్థాలు
మైదా - 2కప్పులు
గడ్డివాము (నల్ల జీలకర్ర) - 1 స్పూన్
ఉప్పు - తగినంత
స్టఫ్ఫింగ్ కోసం:
ఉడికించిన ఆలు - 1 కప్పు
ఉడికించిన బటాణి - 1 కప్పు
ఉల్లిముక్కలు - 1 కప్పు
కసూరి మెంతి - 1 స్పూన్
ఆల్లంవేల్లులి పేస్టు - 1/2 స్పూన్
గరం మసాలా - 1/2 స్పూన్
ఉప్పు కారం - తగినంత
స్టఫ్ఫింగ్ తయారీ విధానం:
ఒక కడాయిలో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. అందులో ఆలు,బటాణి మిశ్రమాన్ని వేసి కదపాలి. తరవాత కసూరి మెంతి పొడిగా చేసి వెయ్యాలి. అందులో గరంమసాల పొడి,రుచికి తగ్గ ఉప్పు కారం వేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు ఉంచి దించి పక్కన పెట్టుకోవాలి.
సమోసా తయారి విధానం:
ఒక బౌల్ లోకి మైదాపిండి తీసుకోండి. అందులో గడ్డివాము,ఉప్పు,కాస్త నూనె వేసి చపాతి పిండిలా కలపండి. ఒక పావుగంట సేపు నానిన తర్వాత వాటిని చపాతిల్లా వత్తుకుని దాని మీద మనకి మార్కెట్ లో దొరికే హార్ట్ షేప్ మౌల్డ్ ని పెట్టి గట్టిగా వత్తండి. అప్పుడు తయారయిన రెండేసి ముక్కలని చివర్లు నీళ్ళతో అతికిస్తూ దాని మధ్యలో తయారు చేసిపెట్టుకున్న ఆలు కర్రీ ని ఉంచి పూర్తిగా మూసెయ్యండి. అలా తయారయిన వాటిని వేడి నూనెలో వేసి ఎర్రగా వేయించి ప్లేట్ లోకి తీసి మీకిష్టమైన వారికి తినిపించండి.
- కళ్యాణి
