కూరపొడి
కావాల్సిన పదార్దాలు:
ఎండుమిరపకాయలు - 10 నుండి 15
ధనియాలు - పావు కప్పు
జీలకర్ర - 2 చెంచాలు
మెంతులు - 1 చెంచా
నువ్వులు - 1 చెంచా
శనగపప్పు - 2 చెంచాలు
మినపప్పు - 2 చెంచాలు
వేరుశనగ గుళ్ళు - 2 చెంచాలు
జీడిపప్పు - 8 నుండి 10
చింతపండు - తగినంత
ఉప్పు - తగినంత
తయారీవిధానం:
* ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి రెండు చెంచాలు నూనె వేసి వేడి చేయలి.
* నూనె వేడెక్కాక అందులో ఎండుమిరపకాయలు, దనియాలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, జీలకర్ర వేసి వేయించాలి. (కావాలనుకుంటే లవంగాలు, మిరియాలు కూడా వేసి వేయించుకోవచ్చు)
* అన్ని కొంచెం వేగాక చింతపండు వేసి... అది కూడా పూర్తిగా వేగాక చల్లార్చి మిక్సీ వేయాలి. అంతే కూరపొడి రెడీ.
