కొబ్బరి రసం
కావలసినపదార్దాలు :
* కొబ్బరిపాలు - 1/2 కప్పు
* చింతపండు రసం - రుచికి తగినంత
* పసుపు - 1/4 స్పూన్
* రసంపొడి - 1/2 స్పూన్
* ధనియాలపొడి - 1/2 స్పూన్
* పోపుగింజలు
* వెల్లుల్లి రెబ్బలు
* ఇంగువ
* కొద్దిగా నూనె
తయారు చేసే విధానం :
* ముందు ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్ళలో చింతపండు, ఉప్పు, పసుపు వేసి మరిగించుకోవాలి.
* బాగా మరిగాక... చితపండు తీసివేసి మరిగించుకోవాలి. ఇష్టమైతే వెల్లుల్లి 4 రెబ్బలు దంచి మరుగుతున్నరసంలో వెయ్యాలి.
* పూర్తిగా మరిగాక స్టౌవ్ ఆఫ్ చేసి అందులో కొబ్బరిపాలు కలపాలి.
* తాలింపుకొరకు ఎండుమిర్చి , ఆవాలు, మెంతులు, జీలకర్ర , కరివేపాను నూనెలో లేదా నేతిలో వేయించి కలపాలి. వేడి అన్నంతో ఈ కొబ్బరి రసం చాలా బావుంటుంది.
