ఖీమా సమోసా...!
కావలసిన పదార్థాలు:
మటన్ ఖీమా - అరకిలో
మైదాపిండి - పావుకిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా
గరం మసాలా - అరచెంచా
పచ్చిమిర్చి - నాలుగు
ఉల్లిపాయ - ఒకటి
పెరుగు - ఒక చెంచా
ఉప్పు - తగినంత
సన్నగా తరిగిన పుదీనా - రెండు చెంచాలు
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
మైదాపిండిలో కొద్దిగా నూనె, ఉప్పు వేసి చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చి మిరపకాయలను సన్నగా తరగాలి. స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేయాలి. వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేవరకూ వేయించాలి. ఆపైన ఖీమా వేసి, ఉప్పు చల్లి కాసేపు మూత పెట్టాలి. ఉడికిన తరువాత గరం మసాలా వేసి రెండు క్షణాలు వేయించాలి. తరువాత పెరుగు వేసి కలిపి, పుదీనా కూడా వేసి దించేయాలి. మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీల్లా ఒత్తుకోవాలి. వీటిని సమోసా ఆకారంలో చేసుకుని, మధ్యలో ఖీమా మిశ్రమం పెట్టి మూసేయాలి. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
- Sameera
