జంతికలు (సంక్రాతి స్పెషల్)
కావలసిన పదార్ధాలు :
బియ్యం పిండి - 1 కిలో
వెన్న - 100 గ్రాములు
నువ్వులు - 50 గ్రాములు
వాము - 2 టీ స్పూన్
కారం - తగినంత
ఉప్పు - సరిపడినంత
నూనె - 1 కిలో
తయారుచేయు పధ్ధతి:
* ముందుగ ఒక కడాయిలొ నూనె పోసి చిన్న మంట మీద పెట్టుకోవాలి.
* ఒక పెద్ద పళ్ళెంలో బియ్యం పిండి వేసి అందులో వెన్నను వేడి చేసి వేసుకొవాలి తరవాత వాము, ఉప్పు, కారం, నువ్వులు కాగుతున్న నూనె రెండు స్సూన్స్ వేసుకొని బాగా కలిపి రెండు గ్లాసుల నీళ్లుపోసి చపాతి పిండిలా కలుపుకోవాలి. నీళ్ళు సరిపోకపోతె మరి కొంచెం కలుపుకోవచ్చు. నూనె బాగా మరిగిన తరవాత, జంతికల గొట్టంలో ముద్దను పెట్టి నూనెలో జంతికలు వేసుకోవాలి.
* జంతికల గొట్టంలో రకరకాలైన ఆకారాలతో ఉన్న చక్రాలు ఉంటాయికదా అందులో మీకు కావలసిన చక్రం పెట్టుకుని వివిద రకాలుగా జంతికల వేసుకొనవచ్చును. అంతే! రుచి కరమైన జంతికలు రెడీ.
- Vissa Nagamani
