జింజర్ లెమనేడ్
తయారీ విధానం:
అల్లం తురుము - రెండు చెంచాలు
నిమ్మరసం - ఎనిమిది చెంచాలు
చక్కెర - నాలుగు చెంచాలు
సోడా - అరలీటరు
ఐస్ క్యూబ్స్ - కావలసినన్ని
తయారీ విధానం:
స్టౌ మీద గిన్నె పెట్టి... అల్లం తురుము, నిమ్మరసం వేయాలి. గులాబిరంగులోకి మారిన తరువాత చక్కెర, పావుకప్పు నీళ్లు వేసి మరిగించాలి. చక్కెర కరిగి నీళ్లు బాగా తిరగబడేవరకూ మరిగించి దించేయాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని ఒక్కసారి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఆపైన ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఇది దాహాన్ని తీర్చడమే కాదు... శక్తిని కూడా ఇస్తుంది.
- Sameera
