వెల్లుల్లి గ్రేవీ
ఏదైనా మసాలా కూర చెయ్యాలంటే ఎప్పుడూ ఒకే రకం గ్రేవీ చేస్తే తినటానికి అంత ఆసక్తిగా అనిపించదు. అందుకే అప్పుడప్పుడు కొంచెం వెరైటీ గ్రేవీలు ట్రై చేస్తే ఇంట్లోవాళ్ళ కాంప్లిమెంట్స్ కూడా అందుకోవచ్చు. అందుకే ఎ రోజు వెల్లుల్లి గ్రేవీ ఎలా చెయ్యాలో చూద్దాం.
కావల్సిన పదార్థాలు:
వెల్లుల్లి పేస్ట్ - 3 స్పూన్స్
అల్లం పేస్ట్ - 1 1/2 స్పూన్
జీడిపప్పు ముద్ద - 1 స్పూన్
పాలు - 1 కప్పు
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు, కారం - రుచికి సరిపడ.
తయారి విధానం:
స్టవ్ వెలిగించి కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసి ముందుగా వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాకా అల్లం పేస్ట్ వేసి బంగారు రంగులోకి వచ్చేదాకా వేగనీయాలి. అందులో జీడిపప్పు పేస్ట్ వేసి కాసేపు ఉన్నాకా పసుపు, ఉప్పు, కారం వేసి 5 నిమిషాలు స్టవ్ ని సిమ్ లో పెట్టి ఉంచాలి. తరువాత దానిలో పాలు పోసి కలపాలి. మిశ్రమం అంతా కాస్త దగ్గర పడ్డాకా అందులో కొత్తిమీర వేసి దించెయ్యాలి. ఇలా తయారయిన గ్రేవీలో మీకు నచ్చిన కూరగాయల్ని, కాస్తంత గరం మసాలాని జతచేసి ఒక కొత్త రెసిపిని మీ వాళ్ళకి పెట్టచ్చు. ఘుమఘుమలాడే వెల్లుల్లి గ్రేవీతో మీ కర్రి రెడీ అవుతుంది.
....కళ్యాణి
