ఫ్రూట్స్ - ఓట్స్ స్మూతీ
కావలసిన పదార్థాలు:
ఓట్స్ - ఒక కప్పు
మామిడిపండు - ఒకటి
అరటిపండు - ఒకటి
సపోటాలు - రెండు
పాలు - అరకప్పు
తేనె - రెండు చెంచాలు
ఐస్ క్యూబ్స్ - ఆరు
తయారీ విధానం:
మామిడిపండును చెక్కు తీసి ముక్కలుగా చేసుకోవాలి. అరటిపండును కూడా తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. సపోటా పండ్లను ఒలిచి గింజలు తీసేయాలి. వీటన్నిటినీ మిక్సీలో వేసి మెత్తని ప్యూరీలా చేసుకోవాలి. ఓట్స్ లో పాలు పోసి స్టౌమీద పెట్టాలి. ఓట్స్ మెత్తబడ్డాక దించేసి చల్లారబెట్టాలి. ఆపైన మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేయాలి. చివరగా ఈ పేస్ట్ లో ఫ్రూట్స్ ప్యూరీ, ఐస్ క్యూబ్స్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. తరువాత తేనె కలిపి సర్వ్ చేయాలి. పండ్ల వల్ల తియ్యదనం వస్తుంది కాబట్టి చక్కెర వేయాల్సిన అవసరం లేదు. తీపి సరిపోదు అనుకుంటే వేసుకోవచ్చు.
- Sameera
