ఎగ్ పెప్పర్ ఫ్రై
కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు - నాలుగు
నెయ్యి - ఒక చెంచా
వెల్లుల్లి రేకులు - నాలుగు
మిరియాల పొడి - రెండు చెంచాలు
జీలకర్ర పొడి - అరచెంచా
కరివేపాకు - ఒక రెమ్మ
ఉప్పు - తగినంత
తయారీ విధానం:
కోడిగుడ్లను ఉడికించి గుల్ల ఒలిచెయ్యాలి. తర్వాత చాకుతో రెండు స్లయిసెస్ లా చేయాలి. వెల్లుల్లి రేకుల్ని సన్నగా తరగాలి. స్టౌ మీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కాక కరివేపాకు, తరిగిన వెల్లుల్లి వేయాలి. పచ్చి వాసన పోయాక మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేయాలి. రెండు క్షణాలు వేయించాక కోడిగుడ్డు స్లయిసెస్ వేయాలి. మసాలా ముక్కలకు బాగా అంటుకునేలా కలిపి, సన్నని మంట మీద వేయించాలి. గుడ్లు బాగా వేగాక దించేసుకోవాలి.
- Sameera
