ఎగ్ కస్టర్డ్ ఫుడ్ (christmas special)
కావలసిన పదార్ధాలు:
గుడ్లు - 2
పాలు - 1 గ్లాస్
చక్కెర - 1/2 కప్పు
మిల్క్ బిస్కెట్స్ - ౩
తయారుచేసుకునే విధానం:
* ముందుగా రెండు గుడ్లు పగులగొట్టి ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
* ఇప్పుడు బిస్కట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అవి నానడానికి అందులో కొద్దిగా నీరు, కొద్దిగా పాలు పోయాలి.
* ముందుగా బౌల్ లో తీసుకున్నా గుడ్లలో 1/2 కప్పు చక్కెర వేసి కరిగేవరకు కలపాలి. అలాగే అందులో కాచి చల్లార్చినా పాలు పోసి, నానబెట్టిన బిస్కట్స్ కూడా వేసి కలుపుకోవాలి. (ఈ మిశ్రమాని క్యారి మిల్ల్క్ అంటారు)
* ఇప్పుడు ఒక బాణాలి తీసుకొని స్టౌవ్ పై పెట్టి అందులో 2,3 స్పూన్స్ చక్కెర వేసి కొంచెం నీరుపోసి కాఫీ కలర్ లోకి వచ్చే వరకు పాకం పట్టుకోని స్టౌవ్ ఆఫ్ చేసి పాకాన్ని ఒక టిఫిన్ బాక్స్ లోకి తీసుకోని దానిలో ముందుగా తయారుచేసి పెట్టుకున్న క్యారి మిల్ల్క్ కలుపుకోవాలి.
* ఒక పెద్ద బాణలి తీసుకొని స్టౌవ్ పై పెట్టి అందులో నీరుపోసి ఈ టిఫిన్ బాక్స్ ను అందులో పెట్టి 20 నిమిషాలు వేడి చేస్తే మనకి కావలసిన ఎగ్ కస్టర్డ్ ఫుడ్ తయారు అవుతుంది. ఈ ఎగ్ కస్టర్డ్ ఫుడ్ ఫ్రీజ్ లో పెట్టి తీసి ఆరెంజ్ తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.
