క్రీం క్యారెట్ సూప్
కావలసిన పదార్థములు:
క్యారెట్ : 1/4 కిలో
క్రీం : 1/4 కప్పు
వెన్న : ఒక చెంచా
ఉల్లిపాయలు : రెండు
వెజ్ స్టాక్ : 2 కప్పులు
ఉప్పు : కొంచెం
మిరియాలపొడి : ఒక స్పూను
తయారుచేయు విధానం:
* ముందుగా క్యారెట్ చెక్కుతీసి సన్నగా ముక్కలు చేసుకోవాలి. పొయ్యి వెలిగించి బాండీ పెట్టి దాంట్లో వెన్న వేసి కాగిన తరువాత క్యారెట్ ముక్కలు వేసి సన్నని సెగ మీద వేగనివ్వాలి.
* మాడకుండా వేపిన తరువాత నీరు లేక వెజ్ స్టాక్ పోసి నీళ్ళు మరుగుతున్నప్పుడు సన్నని మంట మీద ఉంచి ముక్కలను ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత దించి, చల్లారిన తరువాత మిక్సీ వేయాలి.
* బాండీలో కొంచెం వెన్న వేసి దాంట్లో ఉల్లిముక్కలు, క్యారెట్ మిక్సీ పట్టినది వేసి వేగిన తరువాత దానిని వెజ్‌స్టాక్‌లో కలపాలి
* ఈ మిశ్రమానికి క్రీం, కొద్దిగా ఉప్ఫు, మిరియాలపొడి కూడా కలిపి సర్వ్ చెయ్యాలి.
