కార్న్ స్పెషల్స్

 

 

కార్న్ బట్టర్ రైస్

కావలసినవి:
బాసుమతి రైస్ - 2 కప్పులు,
వెన్న - 1/2 కప్పు, 
బాదం పప్పు - 1 టేబుల్ స్పూన్
స్వీట్ కార్న్ - 1 కప్పు,
పంచదార - 2 కప్పులు,
జీడిపప్పు - 2 టీ స్పూన్లు

తయారుచేసే విధానం :
ముందుగా బియ్యం  కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్  వెలిగించుకుని పాన్ పెట్టుకుని వెన్న వేడి చేసిన  జీడిపప్పు, బాదంపప్పు వేగించి పక్కన పెట్టాలి. అందులోనే స్వీట్‌కార్న్ కూడా వేసి బాగా వేగించాలి. తర్వాత అంతకుముందే  నానబెట్టిన  రైస్ వేసి రెండు నిమిషాలు వేగించి నాలుగు కప్పులనీళ్ళు వేసి మూతబెట్టి ఉడికించ, పంచదార వేసి మరో ఐదు నిమిషాలు ఆగి అస్తోవే ఆఫ్ చేసి  డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి.

 

కార్న్ పకోడి

కావలసినవి:
స్వీట్ కార్న్ - 1 కప్పు
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
 బియ్యం పిండి - 1 టీ స్పూన్
 తినే సోడా - చిటికెడు
ధనియాల పొడి - ఒకటిన్నర టీ స్పూన్లు
 జీరా పొడి - 1 టీ స్పూను
 కొత్తిమీర - 1 కట్ట 
ఉప్పు- కొద్దిగా
కారం - తగినంత,
నూనె - సరిపడ
తయారుచేసే విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి నూనె పోసి వేడి అయ్యేలోగా  గిన్నెలో పిండి, మసాల  ఇందులో స్వీట్‌కార్న్, కొత్తిమీర వేసి బాగా కలిపి వేడి నూనెలో పకోడీల్లా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.


మొక్కజొన్న హల్వా

కావలసినవి:
మొక్కజొన్న గింజలు - 1 కప్పు,
 బాదంపప్పు - 1 స్పూన్
పంచదార - 1 కప్పు
నెయ్యి - 1/4 కప్పు,
ఇలాచీ పొడి - 1/2 టీ స్పూను
 జీడిపప్పు,- 1 స్పూన్
కోవా - 50 గ్రాములు
పాలు - 1/4 లీటరు
తయారుచేసే విధానం :
ముందుగా  మొక్కజొన్నగింజలను పేస్ట్ లాగా గ్రైండ్  చేసుకోవాలి.తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యివేసి జీడిపప్పు, బాదాం  వేయించి  పక్కన పెట్టుకోవాలి  తర్వాత మొక్కజొన్న ముద్ద వేసి బాగా వేగించి పాలుపోసి అది ఉడికేటప్పుడు పంచదార , కోవా వేసి వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఇప్పుడు యాలకుల పొడి జీడిపప్పు , బాదాం వేసి ఉడకనివ్వాలి..