కార్న్ పకోడా
కావలసిన పదార్థాలు:
స్వీట్ కార్న్ : ఒకటిన్నర కప్పు
ఉల్లిపాయ : 1
పచ్చిమిర్చి : 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 చెంచా
శనగపిండి : 3 చెంచాలు
బియ్యప్పిండి : ౩ చెంచాలు
కారం : 1 చెంచా
గరం మసాలా : 1 చెంచా
ధనియాల పొడి : అరచెంచా
జీలకర్ర పొడి : అరచెంచా
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
కరివేపాకు : 1 రెమ్మ
కొత్తిమీర : కొద్దిగా
నూనె : వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
ఓ బౌల్ లో స్వీట్ కార్న్ వేయాలి (కార్న్ నోటికి పలుకుల మాదిరిగా తగలకూడదు అనుకుంటే గ్రైండర్లో వేసి బ్లెండ్ చేసుకోవచ్చు. అయితే మరీ పేస్ట్ కాకుండా చూసుకోవాలి). దీనిలో శనగపిండి, బియ్యప్పిండి వేసి బాగా పట్టేలా కలపాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్ని కూడా వేసి బాగా కలపాలి.
ఆ తరువాత నూనె తప్ప మిగతా పదార్థాలన్నిటికీ కూడా వేసి ముద్దలా కలుపుకోవాలి. మరీ పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. కాగిన తర్వాత మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని పకోడీల మాదిరిగా వేయాలి. ఎరుపు రంగు వచ్చేవరకూ వేయించి దించేసుకోవాలి.
- Sameera
