కార్న్ కట్ లెట్
కావలసిన పదార్థాలు:
స్వీట్ కార్న్ - ఒక కప్పు
బంగాళాదుంపలు - రెండు
బ్రెడ్ పొడి - అరకప్పు
క్యాప్సికమ్ ముక్కలు - అరకప్పు
పచ్చిమిర్చి - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా
కారం - ఒక చెంచా
మిరియాల పొడి - చిటికెడు
జీలకర్ర పొడి - అరచెంచా
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం:
స్వీట్ కార్న్ ని మిక్సీలో వేసి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. బంగాళాదుంపల్ని ఉడికించి, ఒలిచి, మెత్తగా చిదమాలి. పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. ఓ బౌల్ లో స్వీట్ కార్న్, బంగాళాదుంప ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ఆపైన కట్ లెట్స్ లాగా ఒత్తుకోవాలి. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువ పీల్చకూడదు అనుకుంటే అట్లరేకు మీద కొద్దిగా నూనె వేసి కాల్చుకోవచ్చు. వీటిని టొమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి.
- Sameera
