కార్న్ చీజ్ బాల్స్
కావలసిన పదార్థాలు:
తురిమిన చీజ్ - ఒక కప్పు
స్వీట్ కార్న్ - పావు కప్పు
మొక్కజొన్న పిండి - అరకప్పు
బంగాళాదుంపలు - రెండు
బ్రెడ్ పొడి - ఒక కప్పు
చాట్ మసాలా - ఒక చెంచా
మిరియాల పొడి - అరచెంచా
మైదా - మూడు చెంచాలు
కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - డీప్ ఫ్రై కి సరిపడా
తయారీ విధానం:
బంగాళా దుంపల్పి ఉడికించి, తొక్క తీసి, మెత్తగా చిదిమి పక్కన పెట్టాలి. ఓ బౌల్ లో స్వీట్ కార్న్, చీజ్, బంగాళాదుంప ముద్ద, మొక్కజొన్న పిండి, చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. అరగంట తర్వాత తీసి ఉండలుగా చేసుకోవాలి. మైదాపిండిలో కొద్దిగా నీరు పోసి జారుడుగా కలపాలి. ఈ పిండిలో ఉండల్సి ముంచి, బ్రెడ్ పొడిలో దొర్లించి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని టొమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి.
- sameera
