చిల్లి టోఫు పనీర్
కావాల్సిన పదార్ధాలు:-
టోఫు పనీర్ - 200 గ్రాములు
మైదా పిండి - 2 స్పూన్లు
మొక్కజొన్న పిండి(కార్న్ ఫ్లోర్) - 2 స్పూన్లు
కారం - 2 స్పూన్లు
టొమాటో కెచప్ -1 స్పూను
చిల్లి సాస్ -1 స్పూను
సోయా సాస్ - 1 స్పూను
మిరియాల పొడి - 1 స్పూను
వెల్లుల్లి (సన్నగా తరిగిన) - 1 /2 స్పూను
అల్లం(సన్నగా తరిగిన) - 1 /2 స్పూను
కాప్సికం ముక్కలు - 1 /4 కప్పు
ఉల్లిపాయ ముక్కలు - 1 /4 కప్పు
పంచదార - 1 /4 స్పూను
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారు చేయు విధానం:-
* టోఫు ముక్కలను చతురస్రాకారంలో కట్ చేసి ఉంచుకోవాలి. ఒక గిన్నె లో మైదా పిండి, కార్న్ ఫ్లోర్ , కారం మరియు తగినంత ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి పిండిని కాస్త పలుచగా కలుపు కోవాలి.
* ఈ పిండి లో పనీర్ ముక్కలు వేసి బాగా కలిపి ఉంచాలి.
* ఇప్పుడు, బాండీ లో నూనె వేసి, నూనె కాగిన తరువాత, పనీర్ ముక్కలను వేసి చక్కగా వేయించు కొని పక్కన పెట్టాలి.
* ఇప్పుడు, వేరే బాండీలో , కొంచెం నూనె వేసి, అందులో తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.
* ఇప్పుడు, ఒక్కొక్కటి గా చిల్లి సాస్, టమాటో కెచప్, సొయా సాస్, మిరియాల పొడి ఉప్పు వేసి బాగా కలుపుతూ ఉండాలి.
* ఈ సాస్ కి, కాప్సికం, ఉల్లిపాయ ముక్కలు చేర్చి ఐదు నిమిషాలు ఉడికించాలి. దీనిలో చిటికెడు పంచదార వేస్తె రుచిగా ఉంటుంది.
* ఇప్పుడు సాస్ లో ముందుగా వేయించుకున్న పనీర్ ముక్కలు కలిపి. ఐదు నిముషాలు ఉడకగానే, స్టవ్ మించి దింపేయాలి. అంతే, చిల్లి టోఫు పనీర్ రెడీ .
* ఈ స్నాక్ ను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
-Bhavana
