కాలీఫ్లవర్ క్యాబేజీ కట్ లెట్
కావలసిన పదార్థాలు
క్యాబేజీ తురుము - 300 గ్రా.
కాలీఫ్లవర్ ముక్కలు - 150 గ్రా.
శనగపిండి - ఒకటిన్నర కప్పు
బియ్యప్పిండి - అరకప్పు
పచ్చిమిర్చి - 5
కారం - 2 చెంచాలు
ధనియాల పొడి - 2 చెంచాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా
నిమ్మరసం - 1 చెంచా
ధనియాలు - 1 చెంచా
ఇంగువ - అర చెంచా
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
కరివేపాకు - ఒక రెమ్మ
కొత్తిమీర - కొద్దిగా
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
క్యాబేజీ తురుముని, కాలీఫ్లవర్ ముక్కల్ని శుభ్రంగా కడిగి కాసేపు ఆరనివ్వాలి. తరువాత ఓ బౌల్ లో క్యాబేజీ, కాలీఫ్లవర్, శనగపిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. దీనితో పాటు మిగతా పదార్థాలన్నిటినీ కూడా క్యాబేజీ, కాలీఫ్లవర్ మిశ్రమంలో వేసి కలపాలి. ఒకవేళ మిశ్రమం మరీ పొడిపొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చేర్చుకోవాలి. తరువాత చేతితో కట్ లెట్స్ మాదిరిగా ఒత్తుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
