క్యారెట్ దాల్
కావలసిన పదార్థాలు:
పెసరపప్పు - ఒక కప్పు
కందిపప్పు - ఒక కప్పు
క్యారెట్ తురుము - రెండు కప్పలు
మిరియాల పొడి - రెండు చెంచాలు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
జీలకర్ర - ఒక చెంచా
ఆవాలు - ఒక చెంచా
అల్లం తురుము - ఒక చెంచా
వెల్లుల్లి రేకులు - నాలుగు
ఎండుమిర్చి - మూడు
కరివేపాకు - ఒక రెమ్మ
కొత్తిమీర - కొద్దిగా
నూనె - ఒక చెంచా
తయారీ విధానం:
పెసరపప్పు, కందిపప్పుల్ని శుభ్రంగా కడగాలి. ఈ రెండు పప్పులతో పాటు క్యారెట్ తురుము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, నీళ్లు వేసి కుక్కర్ లో పెట్టేయాలి. నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేగాక అల్లం తురుము వేయాలి. పచ్చి వాసన పోయాక కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రేకులు వేయాలి. వేగాక ఉడికించిన పప్పులో వేసి కలపాలి. ఆపైన పప్పును కాసేపు స్టౌ మీద పెట్టి, రెండు నిమిషాల పాటు ఉడికించి, మిరియాల పొడి, కొత్తిమీర చల్లి దించేసుకోవాలి.
- Sameera
