అటుకుల తో కట్లెట్స్
కావలసిన పదార్ధాలు:-
అటుకులు - ఒక కప్పు
ఉడికించిన బంగాళాదుంపలు - రెండు
కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు
మైదా పిండి - రెండు స్పూన్లు
కారం - ఒక స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
పసుపు - పావు స్పూను
గరం మసాలా - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర స్పూను
మిరియాల పొడి - అర స్పూను
బ్రెడ్ క్రంబ్స్ - అర కప్పు
నిమ్మరసం - అర స్పూను
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారుచేసే విధానం:-
* ముందుగా, అటుకులను ఒక గిన్నెలో వేసి రెండు కప్పులు నీళ్లు వేసి, బాగా కడిగి నీళ్లను వంపేయాలి.
* ఇప్పుడు ఆ తడి అతుకులలో, ఉడికించిన బంగాళా దుంప ముద్దను, ఒక స్పూను మైదా పిండి, ఒక స్పూను కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
* పైనుంచి పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, నిమ్మ రసం వేసి మెత్తగా కలుపుకోవాలి.
* ఈ ముద్దను పది నిముషాలు పక్కన పెట్టాలి.
* ఇప్పుడు వేరే గిన్నెలో, ఒక స్పూను మైదా పిండి, ఒక స్పూను కార్న్ ఫ్లోర్ వేసి కాస్త మిరియాల పొడి, ఉప్పు వేసి నీళ్లు పోసి పిండి ని జారుగా కలుపుకోవాలి.
* ఒక బాండీ లో నూనె వేసి వేడి చేసుకోండి.
* ఇప్పుడు, మసాలాలతో కలిపినా అటుకుల ముద్దను, గుండ్రంగా కట్లెట్స్ లా వత్తుకుని వాటిని, ఒక్కొకటి గా తీసి జారుగా వున్న మైదా, కార్న్ ఫ్లోర్ కలిపిన పిండి లో ముంచి తీసి, పై నుంచి బ్రెడ్ క్రమ్బ్స్ అద్దుకుంటూ, నూనె లో వేసి వేయించాలి.
* ఈ కట్లెట్స్ ను గోధుమ రంగు లో వచ్చే వరకు వేయించి తీసి, వేడి వేడి గా సెర్వ్ చేయండి.
-Bhavana
