అరటికాయ బజ్జి
కావాల్సిన పదార్ధాలు:
కూర అరటికాయలు - రెండు
సెనగపిండి - పావు కప్పు
బియ్యం పిండి - రెండు టేబుల్ స్పూన్స్
కారం - అర టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
పసుపు - పావు టేబుల్ స్పూన్
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
వేడి నూనె - రెండు టేబుల్ స్పూన్స్
నీళ్ళు - తగినన్ని
నూనె వేపుకోడానికి - సరిపడా
తయారీ విధానం:
అరటికాయకున్న చెక్కుని పల్చగా తీసేయ్యాలి, మరీ లోపల తెల్లగా ఉండే కండ కనపడేలా తీయకూడదు. తరువాత పొడవుగా ముక్కలుగా కోసుకోవాలి. అరటికాయ బజ్జికి రెడీ చేసుకున్నవి అన్నీ సెనగపిండి లో వేసి బాగా కలుపుకోవాలి. తరువాత వేడి నూనె వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్ళు చేర్చి పిండి జారుగా కలుపుకోవాలి. రెడీ చేసుకున్న శనగపిండిలో అరటికాయ ముక్కలు వేసి ఒక్కోక్కటి తీసి వేడి నూనె లో వేసి సన్నని సెగమీద లైట్-గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి ఆ తరువాత సెగను పెంచుకోని ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఇవి వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయ్.