ఆలూ 65
కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు - నాలుగు
మైదాపిండి - ఆరు చెంచాలు
కార్న్ ఫ్లోర్ - నాలుగు చెంచాలు
కారం - రెండు చెంచాలు
గరం మసాలా - అరచెంచా
పెరుగు - ఆరు చెంచాలు
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం:
బంగాళాదుంపల్ని శుభ్రంగా కడిగి, చెక్కు తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. వీటిని నీటిలో వేసి ఉడకబెట్టాలి. అయితే పూర్తిగా మెత్తగా అయిపోకుండా ముప్పావు వంతు ఉడికాక నీటిలోంచి తీసేసి ఆరనివ్వాలి. ఓ బౌల్ లో మైదా, కార్న్ ఫ్లోర్, కారం, గరం మసాలా, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిలో బంగాళాదుంప ముక్కల్ని వేసి, మిశ్రమం ముక్కలకి బాగా అంటేలా కలిపి పక్కన పెట్టాలి. పది నిమిషాల తరువాత కడాయి మీద స్టౌ పెట్టి నూనె వేయాలి. బాగా కాగాక బంగాళాదుంప ముక్కలు వేసి ఎరుపు రంగు వచ్చే వరకూ వేయించాలి. కొత్తిమీర చల్లి వడ్డించాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు నూనెలో వేయించి ఈ ముక్కల్లో కలిపి తింటే చాలా బాగుంటుంది.
- Sameera
