ARTICLES
మహా గణపతి గుడి లో మహా రుద్ర యాగం

 

మహా గణపతి గుడి లో మహా రుద్ర యాగం

 


ఆరిజోనా రాష్ట్రం లోని మారికోపా నగరం లో ఉన్న మహా గణపతి గుడి లో మే 6,7,8 వ తారీ​ఖు​
లలో మహా రుద్రయాగం, మూర్తి ప్రతిష్టాపన జరిగాయి. ఎంతో అద్భుతం గా జరిగిన ఈ యాగం లో పాల్గొనటానికి అమెరికా లోని వివిధ  రాష్ట్రాల నుంచే కాకుండా కెనడా నుంచి, భారత దేశం నుంచి దాదాపు 130 మంది ఋత్విక్కులు వచ్చారు. కంచి కామకోటి పీఠం ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగింది.

15 ఎకరాల సువిశాల ప్రదేశం లో ఉన్న ఈ గుడి లోని మూల విరాట్టు మహా బలిపురం లో చెక్కబడింది. హవాయి లోని కౌఐ అధీనం గురుదేవ సద్గురు శివాయ సుబ్రమునియస్వామి మహా గణపతి మూల విరాట్టు  విగ్రహాన్ని మే 1999  ఆరిజోనా హిందూ సంస్థ కి ఇచ్చారు. మార్చ్ 2000 లో ఈ గుడి స్థాపించబడింది. (http://www.ganapati.org)

మహా రుద్ర యాగం లో భాగంగా గణపతి హోమం, సుదర్శన హోమం, నవగ్రహ హోమం, కోష్ట విగ్రహాల ప్రాణ ప్రతిష్ట, వాస్తు హోమం, 108 మంది ముత్తయిదువులతో అమ్మవారికి దీప పూజ అత్యద్భుతం గా జరిగాయి.  శ్రీ శివ  కోష్ట విగ్రహాలైన శ్రీ గణపతి,  శ్రీ దక్షిణా మూర్తి, శ్రీ లింగోద్భావార్, శ్రీ బ్రహ్మ , శ్రీ దుర్గ  మరియు శ్రీ బాలాజీ  కోష్ట విగ్రహాలైన శ్రీ గణపతి, శ్రీ పరవసుదేవ, శ్రీ విష్ణు  దుర్గ,  శ్రీ నరసింహ, శ్రీ వరాహ దేవతా మూర్తులకు జలధి వాసం,  శయనాధి వాసం, నేత్రోన్మీలనం,  యంత్రాలతో ప్రాణ ప్రతిష్ట , కుంభాభిషేకం శాస్త్రోక్తం గా నిర్వహించారు.

 



మహారుద్రం 1331 సార్లు  121 మంది రిత్విక్కులు పారాయణ చేసారు.  రుద్ర హోమం 121 సార్లు   చేసారు. మహాన్యాసం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. శివ, మహా గణపతి, వెంకటేశ్వర స్వామి మూల విగ్రాహాలకి విశేష పూజలు జరిగాయి. రుద్రాభిషేకం 11 సార్లు, చివరిగా కల​శా​
భిషేకం జరిపించారు.

ఈ మహా రుద్రా యాగం ఎప్పుడు ఎక్కడ నిర్వహించబడినా కూడా అక్కడ తప్పక వర్షం కురుస్తుంది అన్నది ఒక నమ్మిక. ఎడారి ప్రాంతమైన ఆరిజోనా లో మే నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది, ఈ యాగం నిర్వహించబడిన 6,7,8 తారీ​ఖు​ లలో వాతావరణం చాలా చల్లగా ఉండి, తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యాగం నిర్వహించబడుతున్న ప్రదేశము, చుట్టుపక్కల పట్టణాలలో కుంభ వృష్టి గా వర్షం కురిసింది. ఎంతో చక్కగా నిర్వహింపబడిన ఈ కార్యక్రమం లో  వెయ్యి మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. 

 - రాధిక కామేశ్వరి

TeluguOne For Your Business
About TeluguOne
;