ARTICLES
శాన్ ఆంటోనియో లో ఉగాది సంబరాలు

ఎప్పటిలాగానే ఈ సంవత్సరం మూడా ఉగాది పండుగను శాన్ ఆంటోనియో తెలుగు సంఘంవారు చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ నెల 9వ తేదీన షాన్ ఆంటోనియోలోని మహాలక్ష్మిహాలులో తెలుగు అసోసియేషన్ ఆఫ్ షాన్ ఆంటోనియో ఆధ్వర్యంలో 2011 సంవత్సరపు శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించడం జరిగింది.

శాన్ ఆంటోనియో లో ఉగాది సంబరాలు శాన్ ఆంటోనియో లో ఉగాది సంబరాలు

 

 

 

 

 

 

 

మహాలక్ష్మిహాలు మొత్తం ఆహుతులతో కళకళ లాడింది. నిర్వాహకులు వచ్చిన అతిథులకు సాంప్రదాయరీతిలో ఉగాది పచ్చడి మరియు ఉగాది శుభాకాంక్షలతో స్వాగతం పలికారు. సాయంసమయంలో మొదలయిన ఈ ఉగాది వేడుకలు ముందుగా రుచికరమైన బొబ్బట్లు, గులాబ్ జామున్ మరియు రస్ మలాయి వంటి స్వాత్స్ తో కూడిన పండుగ విందుతో ప్రారంభింపబడ్డాయి. అనంతరం ‘ఏకదంతాయ, వక్రతుండాయ’’ ప్రార్థనతో ఉగాది సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఈ సంబరాలకు ప్రత్యేకంగా విచ్చేసిన గాయకులు శ్రీవిశ్వమోహన్ అమ్ములుగారు గానం చేసిన ఈ ప్రార్థనా గీతం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత వెర్మోంట్ నుండి వచ్చిన సంగీతం విద్యార్థి వంశీ ఈవాని త్యాగరాయ పంచరత్న కృతులలో ఒకటైన “సంధించెనే ఓ మనసా’’ గానం చేసి ఆహుతులను మయమరిపించారు. తదుపరి మేఘన, విర్జరప్రియ, ఆదిత్య, అక్షిత్, సిద్ధార్థ్, వంశీకృష్ణ, మహాశ్విన్, శ్రీజన్, సుజయ్, ఉన్నతి, మిథిల్, జాహ్నవి, మౌనిక, సిరి, గాయత్రి, కుషి, వర్ష, సామ్యత్ తదితరులు పాల్గొన్న చిన్నాపెద్దలతో కూడిన “ఫ్యాషన్ షో’’ కన్నుల విందుగా నిర్వహించబడింది. అనంతరం HTSA అర్చకులు శ్రీ రామలింగ శాస్త్రిగారు “పంచాగ శ్రవణం’’ గావించి నూతన సంవత్సరపు ద్వాదశ రాలి ఫలాలను విపులంగా విశదీకరించారు. శ్రీరామలింగ శాస్త్రి గారికి ఉగాది సన్మానం జరిపిన పిదప విద్యార్థులకు TASA స్కాలర్ షిప్పులు ఇచ్చే నిమిత్తం ధనరాషిని UTSA-ISA నిధికి సమర్పించడం జరిగింది.

శాన్ ఆంటోనియో లో ఉగాది సంబరాలు శాన్ ఆంటోనియో లో ఉగాది సంబరాలు

 

 

 

 

 

 

 

TASA అధ్యక్షులు శ్రీ మూర్తి పాటమళ్ళ ఇందు నిమిత్తం మేరకు చెక్కులను ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన శ్రీ పురస్కార్ కు అందజేశారు. అనంతరం సభాముఖంగా NRI వెల్ఫేర్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ వారిచే శ్రీ టి.వెంకటేశ్వర్ (రాజ్) గారికి “హింద్ రతన్ అవార్డు’’ బహుకరించిన సందర్భంగా గౌడ్ దంపతులను సన్మానించడం జరిగింది. సంఘం తరపున రాజ్ మరియు గీతా గౌడ్ దంపతులకు పుష్పగుచ్చం, శాలువా మరియు జ్ఞాపికను అందచేశారు.

కన్వాస్ నుండి విచ్చేసిన శ్రీ విశ్వమోహన్ మరియు హ్యూస్టన్ నుండి వచ్చిన శ్రీమతి శారద ఆకునూరి గార్ల సంగీత విభావరి ఈ ఉగాది వేడుకలలో తలమానికంగా నిలిచాయి. వారు ఆలపించిన సుమధుర పాత, కొత్త పాటల కలయిక ఉగాది వేడుకలకు క్రొంగొత్త వన్నెలను సంతరించి పెట్టింది. విశ్వమోహన్ గారు స్టేజీ మీద పాడుతూ ప్రదర్శించిన నృత్యవిన్యాసాలు సభికులను రంజింప జేయడమే కాక, వారిని కూడా పదంకలిపేట్లు చేశాయి.

శాన్ ఆంటోనియో లో ఉగాది సంబరాలు శాన్ ఆంటోనియో లో ఉగాది సంబరాలు

 

 

 

 

 

 

 

సంగీత విభావరి కొనసాగుతున్నంత సేపు వీరికి “డోర్ ప్రైజెస్’’ బహుకరించబడుతూనే వున్నాయి. కార్యక్రమం చివర్లో గాయినీగాయకులకు ప్రశంసా పూర్వకంగా తగురీతిగా జ్ఞాపికలను బహుకరించారు. వేడుకల చివర్లో TASA కార్యదర్శి ఫణి అట్లూరి గారిచే సభకు వందన సమర్పణ తర్వాత శ్రావ్యమైన “మెడ్లీసాంగ్’’ తో శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది వేడుకలను ముగించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;