RELATED ARTICLES
RELATED EVENTS
RELATED NEWS
ARTICLES
టాసాలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
టాసాలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రవాస భారతీయులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరినొకరు అభినందించుకుంటూ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆనందోత్సాహాలతో, ఉల్లాసంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్స్‌బర్గ్‌లోని భారత రాయబార కార్యాలయంలో భారత స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (టాసా) తరపున తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలను ప్రదర్శించారు. కోయల వివాహ మహోత్సవం గురించి ప్రదర్శించిన అంశం చూపరులను ఆకట్టుకుంది. గిరిజనులు ప్రదర్శించిన నృత్యం అందరిని ఆహ్లాద పరిచింది.