INTERVIEWS
మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు

 

మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మూడవ అంతర్జాతీయ యోగా  దినోత్సవాలు


డల్లాస్ టెక్సాస్: మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర
మాట్లాడుతూ -- మూడవ అంతర్జాతీయ యోగా  దినోత్సవాన్ని ఎం.జి. ఎం. న్ . టి మరియు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్త నిర్వహణలో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా- 1201 హిడెన్ రిడ్జ్ డ్రైవ్, ఇర్వింగ్, (డల్లాస్) టెక్సాస్ వద్ద జూన్ 25, 2017, ఆదివారం ఉదయం 7:30 -9: 30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

 

యోగా చేయడానికి కావలసిన యోగా మాట్స్ ను పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేస్తామని, ఉచిత ప్రవేశం, ఉచిత అల్పాహార ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు .   ఈ వేడుకల్లో  పాల్గొనే వారు  ముందుగా వచ్చి నిర్ణేత పద్దతిలో తమ వాహనముల ను పార్క్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము.  ఈ కార్యక్ర మానికి   టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులు మాట్ రినాల్డి  మరియు ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టోప్ఫర్ ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారు.

 

ఈ యోగా ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని యోగా మరియు ధ్యానంలో ఉన్న  మెళకువలను నేర్చుకొని దైనందిన జీవితంలో క్రమం తప్పకుండా చేస్తూ  శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవాలని డాక్టర్ తోటకూర కోరారు.

 

ఎం.జి. ఎం. న్ . టి కార్యదర్శి రావు కల్వల, వైస్  ఛైర్మన్ సల్మాన్ ఫర్షోరి  మరియు ఇతర బృంద సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు .

 

వివరాల కోసం, దయచేసి www.mgmnt.org సందర్శించండి లేదా ఎం.జి. ఎం. న్ . టి  బోర్డు సభ్యులను  సంప్రదించండి – డాక్టర్ ప్రసాద్ తోటకుర - 817-300-4747, పియుష్ పటేల్ - 214-850-9828, రావు కల్వల -732-309-0621, సల్మాన్ ఫర్షోరి - 469-585-2104, తయాబ్ కుందవాలా - 469 -733-0859, శ్రీమతి షబ్నం మోడ్గిల్-214-675-1754, జాన్ హామండ్  - 972-904-5904,  కమల్ కౌషల్ - 972-795-2328 , లాల్ దస్వాని – 214-566-3111

TeluguOne For Your Business
About TeluguOne
;