INTERVIEWS
డాలస్ లో జాతిపితకు తెలుగు రాష్ట్రాల నాయకుల ఘన నివాళి

 

 

డాలస్, టెక్సాస్: మే 29, 2018. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన రాజకీయ ప్రముఖులు డల్లాస్ లో ఉన్న అమెరికాలో అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శించి జాతిపితకు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల శాఖామాత్యులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ఒక సారి  ఈ గాంధీ మెమోరియల్ ను సందర్శించానని, ప్రతి ఏటా ఈ గాంధీ మెమోరియల్ ప్లాజా మెరుగులు దిద్దుకుంటూ అత్యంత సుందర ప్రదేశంగా వెలుగొందడం సంతోషదాయకం అన్నారు. ఖండాంతరాలల్లో జాతిపిత సిద్ధాంతాలను, ఆశయాలను సజీవంగా ఉట్టిపడేటట్లుగా ఇంతటి మహత్తర కార్యాన్ని సాధించడంలో కృషి చేసిన ప్రవాస భారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర మరియు వారి బృంద సభ్యులకు, సిటీ అధికారులకు, స్థానిక ప్రజలకు అభినందలు తెలియజేశారు.

 

మాజీ మంత్రివర్యులు, టీడీపీ సీనియర్ నేత పెద్ది రెడ్డి మాట్లాడుతూ తొలిసారిగా ఈ గాంధీ మెమోరియల్ ను సందర్శిస్తున్నాని, ఇక్కడికి రాగానే శాంతిదూత గాంధీజీ ఆశయాలు, త్యాగ నిరతి, ప్రపంచంలో అనేకమంది యువకులకు స్ఫూర్తినిచ్చిన తీరు గుర్తుకొస్తున్నాయని, భావితరాలకు తప్పనిసరిగా ఇదొక స్ఫూర్తిదాయక ప్రాంతమౌతుందని ఆశించారు. ఈ పార్కును అభివృద్ధి చేయడంలో సంస్థ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మరియు వారి బృంద సభ్యులు చేసిన కృషి బహుదా ప్రశంసనీయం అన్నారు.

 

 

 

 

గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పాత్తూరి  నాగభూషణం మాట్లాడుతూ మహాత్మా గాంధీ మన భారతదేశంలో జన్మించినా, శాంతి స్నేహం, సుహృద్భావం, అహింస అనే అంశాలే ఆశయాలుగా తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసి ప్రపంచంలో ఒక ఆదర్శ పురుషుడిగా నిలిచిపోయారని, కేవలం భారతీయులే కాకుండా ఇతర దేశాలకు చెందిన ప్రజలు కూడా ఈ గాంధీ మెమోరియల్ ను సందర్సించడం విశేషం అన్నారు.

 

ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిథి కోమటి జయరాం మాట్లాడుతూ పచ్చని చెట్లతో, చక్కని నీటి వనరులతో శాంతికి ప్రతిరూపంగా ఈ గాంధీ మెమోరియల్ ను అత్యంత సుందర పర్యాటక కేంద్రం గా తీర్చి దిద్దిన తీరు ను చూసి ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు.

 

 

తీరికలేని పనులతో బిజీ గా ఉన్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధతో ఈ గాంధీ మెమోరియల్ ను సందర్శించి జాతిపితకు నివాళులర్పించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలకు మరియు స్థానిక ప్రముఖులైన వెంకట్ అబ్బూరు, మురళి వెన్నం, వినోద్ ఉప్పు తదితరులందరికీ  చైర్మన్ డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;