అమెరికా రాజధాని ప్రాంత తెలుగు సంఘము వారు, ఆగష్టు 18 న ఎల్లికాట్ నగరము , మేరీ ల్యాండ్ రాష్ట్రము లో వన భోజనాలు కన్నుల పండుగా జరుపుకున్నారు . క్యాట్స్ ఆధ్యర్యములో , గత మూడు సంవత్సరములు గా ఈ వన భోజనాలు కార్యక్రమము జరుపుకోవడము విశేషము .
క్యాట్స్ వారు, వన భోజనములతో పాటు స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు.పిల్లలు, వందేమాతరము, జనగణ పాటలు పాడి అందరిని ఆకట్టుకున్నారు. 400 మంది, పిల్లలు , పెద్దలు కలసి భోజనాలు చేసి, ఆటల్లో పాల్గొనటం జరిగింది. ఆటల పోటీలలో గెలిచినవారికి, బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.
క్యాట్స్ పాలక వర్గ సభ్యులు గోపాల్ నున్న,మధు కోలా , ప్రవీణ్ కాటంగురి ,సుదర్శన్ దేవిరెడ్డి, భాస్కర్ బొమ్మారెడ్డి ,శ్రీధర్ బాణాల ,ప్రసాద్ వేదాటి , అనిల్ రెడ్డి ,నల్లమద్ది ,గౌడ్ రాంపురం,వెంకట్ గుండా, ప్రవీణ్ యర్రం రెడ్డి, ప్రసాద్ మట్టు పల్లి , ఏ వి యెన్ రెడ్డి ,సోమేశ్ శర్విరాల ,హరీష్, ఉమా కాంత్ , శ్రీవాణి దేవిరెడ్డి, సత్యజిత్ మారెడ్డి, బద్రి చల్ల, రామ్మోహన్ B మరియు క్యాట్స్ స్థాపకులు రామ్ మోహన్ కొండా, చిత్తరంజన్ నల్లు , ఆ పండుగ సందర్భము గా అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. చివరగా దాతలకు, పోషక దాతలకు, విచ్చేసిన అతిథులకు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న పిల్లలకు , ప్రేక్షకులకు, కార్యకర్తలకు, యాజమాన్యానికి, మీడియా కు కృతఙ్ఞతలు తెలియజేసా రు.వందన సమర్పణతో, జాతీయ గీతాలాపనతో , కాట్స్ వన భోజన వేడుకలు ఘనంగా ముగిసాయి.