అమెరికా రాజధాని ప్రాంత తెలుగు సంఘము(క్యాట్స్ ) వారు, ఆగష్టు 17 వ తేది, వాషింగ్టన్,DC నగరములొ సంఘ సేవ లో భాగంగా 5000 మంది పేద వారికి బోజనాలు వండి పెట్టారు . క్యాట్స్ , వాషింగ్టన్ పరిసర ప్రాంతము లో , తెలుగు సంస్కృతిని ప్రోత్సహిస్తూ , సంఘ సేవ కార్యక్రములు కూడా చేపడుతుంది.
గత 9 సంవత్సరాలుగా, తెలుగు బడి నడపడము , తెలుగు పండుగల వేడుకలు, వేసవి లో "తెలుగు పిల్లలకు ప్రత్యేక కార్య క్రమము నిర్వహించడమే కాకుండా, తాము నివసిస్తున్న అమెరికా రాజధాని పరిసర ప్రాంతాలలో , పేద వారికి సేవ చేయాలని ఉద్దేశముతో , ప్రతి సంవత్సము "వాషింగ్టన్ డి సి కిచెన్ లో "వారు నిర్వహించే "ఫుడ్ ఫర్ నీడీ " కార్యక్రముము లో పాల్గొని ,ఆగష్టు 17 వ తేది న, 5000 వేల మందికి భోజనము తాయారు చేసి ఇవ్వడము జరిగినది .
* వాషింగ్టన్ డి సి కిచెన్ లో " నిర్వహించే "ఫుడ్ ఫర్ నీడీ " కార్యక్రముము: http://www.youtube.com/watch?v=xQrz8BNrK6c