EVENTS
అమ్మ భాష కోసం అమెరికాలో నాట్స్ పరుగు

 

అమ్మ భాష కోసం అమెరికాలో నాట్స్ పరుగు


భాషే రమ్యం అని నినదించే నాట్స్ తెలుగుభాషా ప్రేమికులు చేపట్టే ఏ కార్యక్రమానికైనా తాను ముందుంటాననేది మరోసారి నిరూపించింది. తాజాగా అమ్మ భాష తెలుగు కోసం అమెరికాలో తన వంతు కృషి చేస్తున్న సిలికానాంధ్ర మనబడి వారితో కలిసి తెలుగు పరుగు కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రతి అడుగు అక్షరానికి అంకింతమనే నినాదంతో సాగిన ఈ పరుగులో తెలుగు భాషా ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమెరికాలోని  పది రాష్ట్రాల్లో ఏక కాలంలో ఈ పరుగును ప్రారంభించారు. అమెరికాలో తెలుగుజాతి తమ తల్లిభాష గురించి ఎంత పరితపిస్తుందనేది ఈ పరుగు ద్వారా చాటారు. టీ షర్టులపై తెలుగు అక్షరాలు ముద్రించుకని పరుగుపెట్టిన యువతీ యువకులు చిన్నారులు  తియ్యటి తెలుగు భాషలో నినాదాలు చేశారు. 5 కిలోమీటర్ల పాటు సాగిన ఈ పరుగులో యువకులు ఉత్సాహంగా పరుగులు పెడితే.. మిగిలిన వారు అంతే ఉత్సాహంగా నడక సాగిస్తూ తమ భాషాభిమానాన్ని చాటుకున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా కన్నతల్లి లాంటి మాతృభాషను విస్మరించకూడదనే తలంపుతో ఈ తెలుగుకు పరుగు కార్యక్రమాన్ని చేపట్టినట్టు నాట్స్, మనబడి సంస్థలు ప్రకటించాయి. అమెరికాలో నివసించే తెలుగువారికి అమ్మభాషను మరింత ఆదరించాలనే పట్టుదల పెంచే క్రమంలో తాము ఈ పరుగును నిర్వహించామన్నారు. తెలుగు భాషోద్యమాన్ని పరుగు పెట్టించే క్రమంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తుందని నిర్వహకులు తెలిపారు.

 



నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ, కార్యదర్శి రమేష్ నూతలపాటి, బోర్డు అఫ్ డైరెక్టర్స్ దేసు గంగాధర్  మరియు ఇతర కార్య వర్గ సభ్యులు పాల్గొని తెలుగు కోసం సిలికానాంధ్ర చేస్తున్న సేవకు తమవంతు సహాయ సహకారాలను గతం లో సిలికానాంధ్ర తో ఉన్న సత్సంబంధాలను గుర్తు చేశారు. మున్ముందు కూడా విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంచే కార్యక్రమాలను రూపొందించి విద్యార్థీ విదార్థులను ఉత్తమంగా తీర్చి సిద్ధేందుకు  ఇంతకు మించి తెలుగు భాషకు తమవంతు సహాయసహకారాలను కొనసాగిస్తామని తెలియచేసారు. మనబడి ప్రతినిధి శరత్ వేట మరియు ఇతర వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారని పాల్గొన్న పెద్దలు, పిన్నలు ప్రశంసలతో ముంచెత్తారు.

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;