జగన్,కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమే : మోత్కుపల్లి
posted on Nov 21, 2011 3:52PM
హైద
రాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు,వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వర్గం శాసనసభ్యులను కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగా తన సూచనల మేరకే ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెసు పంచన చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు సిబిఐ విచారణ ఎదుర్కొనలేకతిరిగి కాంగ్రెసు గూటికి పంపించేస్తున్నారని అయన అన్నారు. గతంలో జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు కాంగ్రెసుకు ఆయనకు మధ్య ఏం ఒప్పందం జరిగిందో చెప్పాలన్నారు. సిబిఐ విచారణ తీవ్రత తగ్గించమని ఆయన నేతలను ప్రాధేయపడినట్లుగా కనిపిస్తోందన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఇతరులను ఉపయోగించుకొని ప్రత్యర్థులను వేధించడం కాంగ్రెసు పార్టీకి మొదటి నుండి అలవాటేనని మరో నేత గాలి ముద్దకృష్ణమ నాయుడు వేరుగా అన్నారు. గతంలో ద్రోణంరాజు సత్యనారాయణతో దివంగత ఎన్టీఆర్ పైన కేసు వేయించారని విమర్శించారు. చీఫ్ జస్టిస్‌కు ఆశ చూపించి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా తీర్పు తీసుకు వచ్చారని విమర్శించారు.