జగన్‌ను కలిసిన ఈటెల రాజేందర్..టీఆర్ఎస్‌లో కలకలం

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ ఉదయం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి వెళ్లిన ఈటెల..తన కుమారుడి వివాహానికి హాజరుకావాలంటూ జగన్‌ను ఆహ్వానించారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు. ఈటెల కుమారుడు నితిన్ వివాహం ఈ నెల 18న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. ఇప్పటికే ఈ వివాహానికి రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానించారు ఈటెల.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu