భారతదేశం బరువు పెరుగుతోందా..?

అంతరిక్షం నుంచి అభివృద్ధి దాకా ప్రతీ విషయంలో చైనాతో పోటీపడుతున్న మనం ఒబెసిటీ అదేనండి స్థూలకాయంలో..ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేలో స్థూలకాయంతో బాధపడుతున్న పిల్లల 2 బిలియన్లు ఉండగా..సగటు భారత్‌లో ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 14.4 మంది చిన్నారులు ఒబెసిటీతో బాధపడుతున్నట్లు పరిశోధనలో తేలింది. తద్వారా ఈ విషయంలో చైనా తర్వాత స్థానంలో నిలిచిన భారత్ మరో అపప్రదను మూటకట్టుకుంది. 2015లో సంభవించిన మొత్తం మరణాల్లో వారి బీఎంఐ 40 శాతం అదనంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో అమెరికా ప్రజలే అన్ని దేశాల కన్నా ముందున్నారని వెల్లడైంది.

 

పట్టణీకరణ, పోషకహారలేమి, వ్యాయామం లోపించడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. ప్రపంచ జనాభా దాదాపు 710 కోట్లయితే వారిలో 220 మంది, అంటే వారిలో పిల్లలు ఐదుశాతం, పెద్దలు 12 శాతం అధిక బరువుతో బాధపడుతున్నారు. అమెరికాలో 13 శాతం పిల్లలు, 35 శాతం పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. పరిమితికి మించిన బరువు వల్ల కార్డియో వాస్కులర్ వ్యాధులు వచ్చి చిన్న వయసులోనే మృతి చెందుతున్నారు..40 శాతం మంది చనిపోతున్నట్లు వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ క్రిస్ట్‌ఫర్ ముర్రే తెలిపారు. ఒబెసిటీ కారణంగా వారికి సడెన్ హార్ట్ స్ట్రోక్‌తో పాటు షుగర్, క్యాన్సర్ వస్తున్నాయని ఆయన అన్నారు. జనాభా ప్రాతిపదికన చూసుకున్నట్లయితే చైనా, ఆ తర్వాత భారత్ అధిక బరువుతో బాధపడుతున్నాయి. చైనాలో 1.53 కోట్లు, భారత్‌లో 1.44 కోట్ల మంది చిన్నారులు ఒబెసిటీ సమస్యను ఎదుర్కొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu