కత్తికి విషం పూసారనేది అపోహ మాత్రమే
posted on Oct 27, 2018 3:46PM
.jpg)
విశాఖపట్నం విమానశ్రయంలో ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ పై ఓ వ్యక్తి కోడి పందేలలో ఉపయోగించే కత్తితో దాడి చేసిన సంఘటన విదితమే.ఈ దాడిలో జగన్ భుజానికి గాయం అవ్వగా విమానాశ్రయంలోని అపోలో వైద్యులు చికిత్స అందించారు.అనంతరం హైదరాబాద్ వెళ్లిన జగన్ సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నారు. సిటీ న్యూరో హాస్పిటల్ చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన జగన్ లోటస్ పాండ్ కు చేరుకున్నారు. కాగా దాడి జరిగింది కోడి పందేలలో ఉపయోగించే కత్తి కావటంతో విషం పూశారేమోననే అనుమానంతో జగన్ బ్లడ్ శాంపుల్స్‌ను సేకరించి డాక్టర్లు ల్యాబ్‌కు పంపారు.తాజాగా బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ వచ్చిందని వైద్యులు తెలిపారు.జగన్ రక్త నమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు.