జగన్ కు నో పర్మిషన్
posted on Aug 27, 2015 6:52PM
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కరిచి చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే చిన్నారి కుటుంబాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పరామర్సించాలనుకున్నారు కానీ ఆయనకు అనుమతి లభించలేదు. జగన్ కి అనుమతి లభించకపోవడం ఏంటనుకుంటున్నారా?. అక్రమాస్తుల కేసులో జగన్ ఈరోజు కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసు విచారణ కాస్త ఆలస్యంగా రావడంతో అప్పటివరకూ ఎదురు చూసిన జగన్ తను గుంటూరు వెళ్లాల్సి ఉందని.. అందుకు అనుమతించాలని తన తరపు న్యాయవాదిని కోరారు. ఇదే విషయాన్ని న్యాయవాది న్యాయమూర్తికి తెలియజేయగా కేసు విచారణ జరుగుతున్నప్పుడు నిందితులు ఎక్కడికి వెళ్లకూడదు.. ఈ విషయం మీ క్లయింట్ కి తెలియదా అని ప్రశ్నించారు. విచారణ సమయంలో కోర్టులోనే ఉండాలని ఆదేశించింది. దీంతో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ కు అనుమతి లభించలేదు.