యూట్యూబ్‌లో ఇక 3 మినిట్స్ షార్ట్స్!
posted on Oct 4, 2024 4:22PM
యూట్యూబ్ లవర్స్.కి గుడ్ న్యూస్. యూట్యూబ్ తన షార్ట్స్.లో కీలకమైన అప్డేట్ తీసుకొచ్చింది. ఇకపై కంటెంట్ క్రియేటర్లు మూడు నిమిషాల నిడివి వున్న వీడియోలను అప్లోడ్ చేసుకునే వెసులుబాటును తీసుకొస్తున్నట్టు యూట్యూబ్ ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి ఈ మార్పు రానుంది. దీంతో కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్‌తో యూజర్లకు మరింత చేరువ కావడానికి వెసులుబాటు కలగనుంది. యూట్యూబ్ షార్ట్స్.ని తీసుకొచ్చిన కొత్తలో కేవలం 60 సెకండ్ల లోపు వీడియోల మాత్రమే దృష్టిని కేంద్రీకరించింది. ఒక విధంగా చెప్పాలంటే టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లకు పోటీని ఇవ్వడంలో ఇది యూట్యూబ్‌కి సహాయపడింది. ఈ క్రమంటో కంటెంట్ క్రియేటర్ల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని షార్ట్స్ నిడివిని మూడు నిమిషాలకు పెంచాలని యూట్యూబ్ నిర్ణయించింది. మూడు నిమిషాల నిడివి కలిగిన షార్ట్స్.ని యూజర్లు పొందేలా తన రికమండేషన్స్.లో మార్పులు చేయనుంది. దీంతోపాటు కంటెంట్ క్రియేషన్కి సంబంధించిన మరికొన్ని కొత్త ఫీచర్లను యూట్యూబ్ ప్రకటించింది. కొత్తగా టెంప్లేట్ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ట్రెండింగ్ వీడియోలను ‘రీమిక్స్ బటన్’ ద్వారా కొత్త వీడియోగా రీ క్రియేట్ చేయొచ్చున. ట్రెండింగ్, పాపులర్ వీడియోలకు పర్సనల్ టచ్ ఇవ్వడంలో కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫీజర్ ఉపయోగపడనుంది. అలాగే యూట్యూబ్ కంటెంట్‌ని షార్ట్స్.గా మలిచేందుకు రాబోయే కొన్ని నెలల్లో కొత్త ఫీచర్‌ని యూట్యూబ్ అందుబాటులోకి తీసుకురాబోతోంది.