బ్రహ్మోత్సవాల ధ్వజారోహణకు ఇబ్బందేమీ లేదు!

శుక్రవారం సాయంత్రం తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా ధ్వజారోహణం జరగనుంది.ధ్వజస్తంభంపై గరుడ పఠాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్నారు. ఈ ధ్వజారోహణ ఘట్టంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ ఘట్టానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తుండగా గరుడ పఠాన్ని ఎగురవేయాల్సిన ఇనుప కొక్కి విరిగిపోయినట్లుగా అర్చకులు గుర్తించారు. దీంతో ఆందోళన చెందిన అర్చకులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. ఈ చిన్న సంఘటన విషయంలో కొన్ని మీడియా సంస్థలు రాద్ధాంతం చేశాయి. ధ్వజారోహణే ఆగిపోతోందన్నట్టుగా కథనాలు వండి వడ్డించాయి. అయితే అలాంటి ప్రమాదమేమీ లేదని, ధ్వజారోహణ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని తెలుస్తోంది.