యోగి సంచలన నిర్ణయం..రాజకీయాల్లో ఉండను..!
posted on Jul 7, 2017 11:49AM
.jpg)
యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం.. ఆ తరువాత యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా నియమించడం... ఇక యోగి కూడా ముఖ్యమంత్రిగా తమదైన మార్క్ చూపిస్తూ.. పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. ఇక యోగి పాలనకు గాను.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు గాను.. యోగి భావి ప్రధాని అని..ప్రధాని నరేంద్రమోడీ అనంతరం ఆ బాధ్యతలను చేపట్టబోయేది యోగినే.. ‘కాబోయే ప్రధానమంత్రి..’ మోడీయే అంటూ పలు ఊహాగానాలు తలెత్తుతున్నాయి. అయితే వీటిపై స్పందించిన యోగి.. తాను ఎక్కువకాలం రాజకీయాల్లో ఉండను అనే ప్రకటన చేసి అశ్చర్యపరిచారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలు తనకు యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇవ్వడం తన అదృష్టం అని.. ఈ బాధ్యతలు పూర్తి చేసిన అనంతరం తను మఠానికి వెళ్లిపోతాను అని ఆయన స్పష్టం చేశారు.