సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ...

 

టెస్ట్  మ్యాచ్ సిరీసుల్లో కోహ్లీ ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో  రికార్డు సాధించాడు. టీమిండియా, వెస్టిండీస్ మధ్య ఆఖరి వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కోహ్లి సెంచరీ బాది అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. కోహ్లికి వన్డేల్లో ఇది 28వ సెంచరీ. చేజింగుల్లో 18వది. భారత్ తరఫున చేజింగ్‌లో ఒక బ్యాట్స్‌మన్‌కు ఇవే అత్యధిక సెంచరీలు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. సచిన్ చేజింగ్‌లో 17 సెంచరీలు సాధించాడు. 232 ఇన్నింగ్స్‌లు ఆడి సచిన్ ఈ రికార్డును నెలకొల్పాడు. కానీ కోహ్లీ మాత్రం కేవలం 102 ఇన్నింగ్స్‌ల్లోనే రికార్డ్ సృష్టించాడు. ఇక శ్రీలంక స్టార్ తిలకరత్నే  దిల్షాన్ 116 ఇన్నింగ్స్‌ల్లో 11 చేజింగ్ సెంచరీలను చేసి మూడో స్థానంలో ఉన్నాడు. దీంతో కోహ్లీ సాధించిన రికార్డుకు సచిన్ టెండూల్కర్, జయసూర్య వంటి దిగ్గజాలు వందలకొద్ది ఇన్నింగ్స్‌లు తీసుకుంటే.. కోహ్లి మాత్రం చిరుతలా పరిగెడుతూ తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఆ రికార్డులను సాధిస్తున్నాడు అని కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu