టాయిలెట్ కట్టుకుంటే చనిపోతారట..!
posted on Jul 7, 2017 12:18PM
.jpg)
టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా.. దేశం ఎంత అభివృద్ది చెందుతున్నా.. ఇప్పటికీ కొంతమందికి కొన్ని పట్టింపులు, మూఢనమ్మకాలు అనేవి అలానే ఉన్నాయి. వాటినే పాటిస్తున్నారు. అలాంటి విచిత్రమైన ఒక మూఢనమ్మకాన్నే బీహార్ లోని ఘాజీపూర్ గ్రామ ప్రజలు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అంటూ.. బహిరంగ మలమూత్ర విసర్జనను నిర్మూలించేందుకు చర్యలు చేపడుతుంటే అక్కడి వారికి మాత్రం టాయిలెట్ లు ఉండవు. అంటే టాయిలెట్లు కట్టుకోవడానికి వారి దగ్గర డబ్బులు లేవు అని కాదు.. అవి కట్టుకోకపోవడానికి ఓ పెద్ద స్టోరీనే ఉంది. స్టోరీలోకి వెళితే... 1984లో సిద్ధేశ్వర్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో టాయిలెట్ నిర్మిస్తున్న సమయంలో అతని కొడుకు ఓ వింత వ్యాధి కారణంగా చనిపోయాడట. దాంతో అప్పటి నుంచీ ఆ ఊళ్లో ఎవరూ ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకో లేదు. ఆ తరువాత 1996లో రామ్‌పర్వేశ్ శర్మ అనే వ్యక్తి ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి టాయిలెట్ నిర్మాణం మొదలుపెట్టాడు. విచిత్రమేంటంటే.. అతని కొడుకు కూడా వ్యాధి కారణంగా చనిపోయాడు. ఇక ఆ తరువాత జరిగిన రెండు మూడు ఘటనలు కూడా వారి నమ్మకాన్ని ఇంకా బలపడేలా చేశాయి. ఇంకేముంది ఇదో పెద్ద సెంటిమెంట్ గా మారింది. దీంతో ఎవరూ టాయిలెట్ నిర్మించే సాహసం చేయడం లేదు. అంతేకాదు టాయ్‌లెట్ నిర్మించి తమ కుటుంబ సభ్యులను దూరం చేసుకోలేమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు అక్కడి ప్రజలు.