ఆర్‌కే బీచ్‌లో యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌లో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రధాని  రానున్న సందర్బంగా ఆర్కే బీచ్‌ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్సు నుంచి బీచ్‌ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు. 

వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. ఇవాళ సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అనారోగ్యంతో భాధపడుతు కన్నుమూశారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఆదివారం విశాఖపట్నం చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.